Breaking News

బెడ్‌పై సమంత.. మత్తు వదలట్లే.. అక్కినేని కోడలు పిల్ల సండే స్పెషల్ ట్రీట్


ఎవరికైనా సరే ఆదివారం వచ్చిందంటే అదో చిన్న పాటి పండుగలా ఫీలవుతుంటారు. సండే అన్నింటికి వీడ్కోలు పలికి ఎంజాయ్ చేస్తుంటారు. పనికి దూరంగా ఉంటూ.. ఆ ఒక్కరోజునీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సెలెబ్రిటీలు మరీ ముఖ్యంగా వీకెండ్‌ను ఓ రేంజ్‌లో గడుపుతుంటారు. పబ్‌లు, పార్టీలు అంటూ దుమ్ములేపుతుంటారు. వారం మొత్తం షూటింగ్‌లతో బిజీగా ఉండే తారలు ఒక్క ఆదివారం మాత్రం వాటన్నంటికి దూరంగా ఉంటారు. అలా తన ఆదివారాన్ని ఎంతో చక్కగా ఆస్వాధిస్తున్నారు. మామూలుగా అయితే ప్రతీరోజూ ఉదయమే లేచి అన్ని పనులను చేసుకుంటూ ఉంటారు. యోగా, వ్యాయామం, తన ఫార్మింగ్ పనులు ఇలా అన్నింటిని చేసుకుంటూ ఉంటారు సమంత. కానీ ఆదివారం వస్తే మాత్రం ఆ పనులకు కాస్త బ్రేక్ ఇస్తుంటారు. తాజాగా సమంత ఓ పోస్ట్ చేశారు. అందులో సమంత ఇంకా నిద్ర మత్తు వదల్లేనట్టు కనిపిస్తోంది. సండే కదా అని బారెడు పొద్దు ఎక్కేదాక పడుకున్నట్టు కనిపిస్తున్నారు. అంతే కాకుండా టైం ఎంత అవుతుందో కూడా చెప్పుకొచ్చారు. ఉదయం పది గంటల ఐదు నిమిషాలు అవుతుంది.. ఇంకా నిద్ర వస్తోందన్నట్టుగా మంచి పడకేసినట్టు పేర్కొన్నారు. అయితే సండే వస్తే ఇంట్లో స్పెషల్ లంచ్ ఉంటుందని సమంత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. సండే వస్తే చాలు మా ఇంట్లో లంచ్ అదిరిపోతుంది.. ఆ ఒక్క రోజే చైతూ కూడా నాన్ వెజ్ తింటాడని ఆ మధ్య పేర్కొన్నారు. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. రాకుమారి పాత్రలను పోషించాలనేది తన కల అని అది ఇన్నాళ్లకు ఇలా శాకుంతలం సినిమాతో నిజమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు, ఇంత బడ్జెట్ పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నిర్మాతలకు సమంత స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. పైగా ఈ బడ్జెట్ తన స్థాయిని మించేలా ఉందని కూడా అన్నారు.


By March 21, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-samantha-akkineni-feel-lazy-at-sunday-morning/articleshow/81614184.cms

No comments