Breaking News

బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. బట్టలూడదీసి తరిమికొట్టిన రైతులు


బీజేపీ ఎమ్మెల్యేపై రైతులు దాడికి పాల్పడిన ఘటన పంజాబ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై దాడిచేసి, ఆయన ఒంటిమీద దుస్తుల్ని చింపి వెంటబడి తరిమి కొట్టారు. ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నంలో ఎస్పీకి సైతం గాయాలయ్యాయి. అబోహర్‌ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌పై ముక్తసర్ జిల్లా మాలోట్‌‌లో రైతులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కొంతమంది ఎమ్మెల్యే మీదపడి దుస్తులను చింపేశారు. స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడానికి ఎమ్మెల్యే రాగా ఈ ఘటన జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమంలో పంజాబ్‌ రైతులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులపై రైతులు కొంతకాలంగా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ మాలోట్‌కు చేరుకోగానే.. కొందరు రైతులు వారిని చుట్టుముట్టారు. నేతలు, వారి వాహనాలపై సిరా చల్లి దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యేను సెక్యూరిటీ గార్డులు పక్కకు తీసుకువెళ్లినా వదలకుండా వెంటబడ్డారు. ఆయనపై దాడిచేసిన రైతులు, ఒంటిమీద దుస్తులు చింపి పీలికలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేను వారి దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఫరీద్‌కోట్‌ ఎస్పీకి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేపై దాడిని పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా సైతం ఈ దాడి బాధాకరమని వ్యాఖ్యానించింది. బీజేపీ, దాని మిత్రపక్షాలే దీనికి బాధ్యత వహించాలని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి పంజాబ్‌లో శాంతిభద్రతల వైఫల్యానికి ఇది నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ ఆరోపించారు. తనపై రైతుల దాడి వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు పంజాబ్ పోలీసులపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ సీనియర్లను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటానని అరుణ్ అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దంపడుతోందని దుయ్యబట్టారు. తనపై దాడిచేసినవారు నిజమైన రైతులు కాదని, వారిని ఎవరో ప్రేరేపించారని ఆరోపించారు.


By March 28, 2021 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-bjps-abohar-mla-arun-narang-some-other-party-leaders-thrashed-in-malout-town/articleshow/81733026.cms

No comments