Breaking News

యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారు.. నటి నవనీత్ కౌర్ సంచలన ఆరోపణ


మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే జైలుకు పంపుతామని ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని నటి, అమరావతి రానా సంచలన వ్యాఖ్యలు ఛేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్, శివసేన పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు, మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. తనకు రాసిన బెదిరింపు లేఖపై తేదీని మార్చి 22గా పేర్కొన్నారని నవనీత్ కౌర్ తెలిపారు. ‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగింది.. అరవింద్ సావంత్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొంది ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా... నిన్ను కూడా మేము ఊచలు వెనుక కూర్చోబెడతాం’ అని లోక్‌సభ లాబీలో బెదిరించినట్టు తెలిపింది. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్టయ్యి ఒక్కసారిగా సావంత్‌వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ఈ మాటలను మీరు విన్నారా అని ఆయనను అడిగితే.. విన్నానని చెప్పారు’ అంటూ నవనీత్ వివరించారు. సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నారు. ‘పోలీసులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయి.. అలాగే, ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడితే అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లు చేశారు’అని నవనీత్ ఆరోపించారు. నవనీత్ ఆరోపణలపై స్పందించిన అరవింద్ సావంత్.. ‘నా జీవితంలో ఎవరినీ ఇప్పటి వరకూ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడం ఏంటి’ అని వీడియో మెసేజ్ ద్వారా పేర్కొన్నారు. ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.


By March 23, 2021 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/actress-amaravati-mp-navneet-kaur-allegation-on-shiv-sena-mp-arvind-sawant/articleshow/81646609.cms

No comments