Breaking News

బెంగాల్‌ను నాశనం చేయనీయబోం.. మమతను టార్గెట్ చేసిన మోదీ


బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆదివారం కోల్‌కతాలో పర్యటించిన మోదీ.. ‘బ్రిగేడ్ ఛలో ర్యాలీ’లో పాల్గొన్నారు. దీదీ పాలన బెంగాల్ ప్రగతికి అంతరాయం కలిగించిందని ఆయన ఆరోపించారు. బెంగాల్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని.. బంగారు బెంగాల్‌ను, ప్రగతిశీలమైన రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. ‘ఈ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎందరో గొప్ప నేతలకు సాక్ష్యంగా నిలిచింది. బెంగాల్ పురోగతిని అడ్డుకున్నవారికి సైతం ఈ మైదానం సాక్ష్యంగా నిలిచింది. బెంగాల్ ప్రజలు మార్పు రాదనే ఆశను ఎప్పుడూ కోల్పోలేదు’ అని దీదీపై మోదీ పరోక్షంగా సెటైర్లు వేశారు. టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు బెంగాల్ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాయని మోదీ మండిపడ్డారు. ఓవైపు బెంగాల్ వ్యతిరేక వైఖరి కనబర్చే టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఉంటే.. మరోవైపు బెంగాల్ ప్రజలు ఉన్నారన్నారు. బెంగాల్‌ను నాశనం చేయనీయబోమన్నారు. బెంగాల్‌లో పూర్తి మార్పు తీసుకొస్తామన్న మోదీ.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొచ్చి బెంగాల్‌ను పునర్ నిర్మిస్తామన్నారు. బెంగాల్ అభివృద్ధికి వచ్చే 25 ఏళ్లు ఎంతో కీలకమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. పాతికేళ్ల అభివృద్ధికి రాబోయే ఐదేళ్లు పునాది వేస్తాయన్నారు.


By March 07, 2021 at 03:34PM


Read More https://telugu.samayam.com/news/pm-modi-fires-on-tmc-promises-ashol-parivartan-in-west-bengal-ahead-of-assembly-polls/articleshow/81376547.cms

No comments