Breaking News

చిరంజీవి మూవీ సెట్స్ వద్ద ఉపాసన సందడి.. అటవీ ప్రాంతంలో రామ్ చరణ్ జోడీ హంగామా


మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా '' ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'సిద్ద' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. దాదాపు ఆయన రోల్ 30 నిమిషాలకు పైగానే ఉండనుందట. చెర్రీతో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేసిన కొరటాల శివ.. ప్రస్తుతం ఆ సాంగ్ షూట్ చేస్తున్నారట. కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ఈ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు. అయితే షూటింగ్ చూసేందుకు అక్కడికి వెళ్లిన మెగా కోడలు సెట్స్‌పై తెగ సందడి చేసింది. అటవీ ప్రాంతంలో రామ్ చరణ్- ఉపాసన జోడీని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరికీ అభివాదం తెలిపిన ఉపాసన.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం లోని పాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడింది. అనంతరం వారితో సరదాగా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. అంతకుముందు చెర్రీ షూటింగ్ చూసేందుకు బయల్దేరిన ఉపాసన రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టులో కెమెరా కంటికి చిక్కడంతో ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఆచార్య సినిమా విషయానికొస్తే.. మెగాస్టార్ 152వ సినిమాగా దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. చిత్రాన్ని మే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


By March 05, 2021 at 01:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-at-chiranjeevis-acharya-shooting-spot/articleshow/81345979.cms

No comments