Breaking News

చూడగానే అమల ముద్దులు పెట్టేసింది.. చిరంజీవిని అడిగితే ఆ మాట అన్నారు.. నాగార్జున రొమాంటిక్ కామెంట్స్


అక్కినేని లీడ్ రోల్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'వైల్డ్ డాగ్'. కొన్నేళ్ల క్రిందట హైదరాబాద్‌ను వణికించిన గోకుల్ చాట్ పేలుళ్లు, దేశంలో జరిగిన ఇతర ఉగ్రవాద ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే రిలీజ్ చేసిన చిత్ర ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుతూనే రొమాంటిక్ కామెంట్స్ చేశారు నాగార్జున. ‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌ రెడీ చేశాక ఆ వీడియో చూడమని ఓ రోజు చిరంజీవిని అడిగానని, మీకు వీడియో నచ్చితే ట్రైలర్‌ లాంచ్‌ చేయాలని అడుగుదామనుకుంటున్నా అని ఆయనతో చెప్పానని నాగార్జున తెలిపారు. అయితే దీనిపై రియాక్ట్ అయిన చిరంజీవి.. ట్రైలర్‌ నచ్చినా నచ్చకపోయినా, సినిమా ఎలా ఉన్నా సరే. నువ్వు నాకు నచ్చుతావు నాగ్‌ అన్నారని తెలిపారు. ఖచ్చితంగా ట్రైలర్‌ లాంచ్‌ చేస్తా అని మాటిచ్చిన చిరంజీవి.. వీడియో చూశాక చాలా బాగుంది అని మెసేజ్ చేశారంటూ నాగార్జున తన సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే తన భార్య ఫీలింగ్స్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు నాగార్జున. వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసిన వెంటనే అమల తనకు మెసేజ్ చేసిందని, అందులో చూస్తే..10 ముద్దుల ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, మరో 10 స్టార్ ఎమోజీలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. అదే విధంగా ట్రైలర్ పట్ల మహేష్ బాబు, ఆయన ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారని నాగార్జున తెలిపారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయవర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆయన సరసన దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. సయామీ ఖేర్, అలీ రెజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


By March 16, 2021 at 09:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/wild-dog-trailer-akkineni-nagarjuna-says-about-amala-feelings-on-this-video/articleshow/81523674.cms

No comments