Breaking News

టీకా వేసుకున్న మహిళ మృతి.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేసిన ఆస్ట్రియా


ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌‌ను ఆస్ట్రియా నిలిపివేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ మృతిచెందగా.. మరొకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్ట్రియా ఈ నిర్ణయం తీసుకుంది. తీసుకోవడం వల్లే చనిపోయినట్టు విచారణలో వెల్లడయ్యిందని ఆస్ట్రియా ఆరోగ్య శాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. ‘దిగువ ఆస్ట్రియా ప్రావిన్సుల్లోని జ్వెట్టల్ డిస్ట్రిక్ట్ క్లినీక్‌లో ఒకే బ్యాచ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న ఇద్దరు అస్వస్థతకు గురయినట్టు ఆరోగ్య సంరక్షణ (సేఫ్టీ) విభాగం బీఏఎస్జీ నివేదిక అందింది’ అని పేర్కొన్నాయి. టీకా తీసుకున్న తర్వాత ఓ 49 ఏళ్ల మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది.. మరో 35 ఏళ్ల మహిళకు ధమనుల్లో రక్తం గడ్డుకట్టుకుపోయిందని, ప్రస్తుతం ఆమె కోలుకుందని తెలిపింది. పల్మనరీ ఎంబాలిజమ్ అనే వ్యాధి రక్తం గడ్డకట్టుకుపోయి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారు కొత్తగా అస్వస్థతకు గురయినట్టు ఆధారాలు లభించలేదని బీఏఎస్జీ వివరించింది. టీకా కారణంగా అస్వస్థతకు గురయిన మహిళలు జ్వెట్టల్ క్లినిక్‌లో పనిచేస్తున్నట్టు స్విస్ మీడియా పేర్కొంది. అయితే, రక్తం గడ్డకట్టడం అనేది టీకా దుష్ప్రభావం కాదని బీఏఎస్జీ తెలిపింది. కానీ, దీంతో టీకాకు ఏదైనా సంబంధం ఉందా? అనేది తెలుసుకోడానికి ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోందని వ్యాఖ్యానించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దుష్ప్రభావానికి కారణమైన బ్యాచ్‌కు చెందిన డోస్‌లను ఇకపై వినియోగించరాదని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. దీనిపై ఆస్ట్రాజెనెకా‌ను సంప్రదించడానికి రాయిటర్స్ ప్రయత్నించగా.. ఆ సంస్థ తక్షణమే స్పందించలేదు. ఈ అంశంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ఆస్ట్రియా యంత్రాంగానికి ఆస్ట్రాజెనెకా చెప్పిందని ఏపీఏ న్యూస్ పేర్కొంది. ఐరోపా ఔషధాల ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీకా సురక్షితమైంది, సమర్ధవంతమైందని ప్రపంచవ్యాప్తంగా 23వేల మంది వాలంటీర్లపై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని పేర్కొన్నాయి.


By March 08, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/austria-suspends-astrazeneca-oxford-covid-19-vaccine-batch-after-womans-death/articleshow/81387704.cms

No comments