Breaking News

యువకుడ్ని దారుణంగా కొట్టి.. పాక్, ఒవైసీకీ వ్యతిరేకంగా నినాదం చేయాలని ఒత్తిడి!


పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయలంటూ ఓ యువకుడిని బలవంతం చేసి దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. బాధితుడిని కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు అజయ్ గోస్వామి.. బాధిత యువకుడ్ని కిందిపడేసి ‘హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్థాన్ డౌన్‌డౌన్ అని పెద్దగా అరచి చెప్పు’ అంటూ బలవంతం చేశాడు. నిందితుడు అదిమిపెట్టడం వల్ల బాధతో విలవిల్లాడిపోయిన బాధితుడు.. తనను వదిలిపెట్టాలని కాళ్లుపట్టుకున్నాడు. ఈశాన్య ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం పాకిస్థాన్‌కు మాత్రమే కాకుండా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని బలవంతం చేశాడు. యువకుడ్ని హింసిస్తుండగా దీనిని అటుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో నిందితుడిపై కేసు నమోదుచేసిన అరెస్ట్ చేసినట్టు ఈశాన్య ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ సైన్ ట్విట్టర్‌లో తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. అయితే, అజయ్‌ గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అల్లర్ల ఘర్షణల్లో అజయ్ నిందితుడిగా ఉన్నాడు. సీఏఏ వ్యతిరేక ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. తాజా కేసులో నిందితుడిపై దోపిడీ, హత్యాయత్నం కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. గోస్వామి కొడుతుంటే దీపక్ అనే వ్యక్తి వీడియో తీసినట్టు పేర్కొన్నారు.


By March 25, 2021 at 12:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-thrashed-and-forced-to-chant-anti-pak-and-asaduddin-owaisi-slogans-in-delhi/articleshow/81684659.cms

No comments