Breaking News

లోక్‌సభ స్పీకర్‌కు కరోనా.. ఎయిమ్స్‌కు తరలింపు, ఎంపీల్లో గుబులు


లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. మార్చి 19న నిర్వహించిన పరీక్షల్లో స్పీకర్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని వైద్యులు వివరించారు. మార్చి 20న ఎయిమ్స్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స కోసం కోసం చేరారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, శరీరంలోని అన్ని వ్యవస్థలూ సాధారణంగానే ఉన్నాయని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా స్పీకర్ కోవిడ్ బారినపడటం కలకలం రేగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను అధికారులు ట్రేసింగ్ చేస్తున్నారు. ఇటీవల ఆయనను కలిసి ఎంపీల్లో గుబులు రేగుతోంది. కోవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. తొలి విడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, రెండు దశలుగా జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల తొలి విడత నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15న కాకుండా ఫిబ్రవరి 13న ముగిసింది. మార్చి 8 నుంచి రెండో విడత ప్రారంభం కాగా.. ఏప్రిల్ 8న ముగియనున్నాయి. కానీ, అనూహ్యంగా లోక్‌సభ స్పీకర్ కరోనా బారినపడటంపై సమావేశాల నిర్వహణపై సందేహాలకు వ్యక్తమవుతున్నాయి. గతేడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలవ్వడంతో అర్ధాంతరంగా రద్దుయ్యాయి. దేశంలో వైరస్ నియంత్రణకు తొలిసారిగా మార్చి 22న 14 గంటల జనతా కర్ఫ్యూ విధించారు. అదే రోజు రాత్రి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సరిగ్గా దేశంలో లాక్‌డౌన్ విధించి ఏడాది పూర్తవుతోంది.


By March 21, 2021 at 02:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lok-sabha-speaker-om-birla-tested-covid-positive-shifted-to-aiims/articleshow/81615755.cms

No comments