Breaking News

హ్యారీ ఇంటర్వ్యూతో రాజకుటుంబంలో ప్రకంపనలు.. ఎలిజిబెత్ రాణి కీలక ప్రకటన


ఓప్రా విన్‌ఫ్రేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో , దంపతులు వెల్లడించిన విషయాలు యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఇవి బ్రిటిష్ రాజ కుటుంబంలోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. తాను జాత్యాహంకార వేధింపులను ఎదుర్కొన్నట్టు మేఘన్ మార్కెల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా, ఎలిజిబెత్ రాణి-2 స్పందించారు. రాజకుటుంబంలో ఉన్నప్పుడు తన మనవడు హ్యారీ, ఆయన భార్య గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘హ్యారీ, మేఘన్‌లకు గత కొన్నేళ్లు ఎంత సవాల్‌గా మారియో పూర్తిస్థాయిలో తెలుసుకున్నామని, ఈ విషయంలో మొత్తం కుటుంబం బాధపడింది’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ముఖ్యంగా జాత్యాహంకార అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.. కొన్ని జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు.. వాటిని చాలా తీవ్రంగా పరిగణించాం.. కుటుంబంలో అంతరంగికంగా చర్చించి పరిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు. హ్యారీ, మేఘన్, వారి కుమారుడు అర్చీలను తాము ఎల్లప్పుడూ కుటుంబసభ్యులుగా ప్రేమిస్తూనే ఉంటామని తెలిపారు. హ్యారీ, మేఘన్ వ్యాఖ్యలు బ్రిటిష్ రాజకుటుంబం, దేశ అత్యంత గౌరవనీయమైన సంస్థలపై పేల్చిన బాంబుగా పోల్చుతున్నారు.ప్యాలెస్‌లో ఉన్న సమయంలో నిరాధారణకు గురయ్యారని, ఒక్కోదశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ తనను చుట్టుముట్టాయని మేఘన్ తెలిపారు. తమకు పుట్టబోయే బిడ్డ నల్లగా ఉంటాడేమోనని రాజకుటుంబీకులు ఆందోళనపడిన విషయం తెలిసి బాధపడ్డాడనని వివరించారు. ఒకవేళ బిడ్డ నల్లగా పుడితే తనకు ఆస్తిలో హక్కుగా రావాల్సిన వాటా రాదని హ్యారీ చెప్పినట్లు మేఘన్ వెల్లడించింది. తనరాకతో రాజకుటుంబం చాలా ఇబ్బందుల్లో పడుతోందంటూ పలు పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయని.. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పింది మేఘన్. అయితే అదంతా అవాస్తవమని .... తననే రాజకుటుంబం చాలా ఇబ్బందులకు గురిచేసిందని ఇదే వాస్తవమని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో హ్యారీ దంపతులు వెల్లడించిన విషయాలు సంచలనాన్ని రేపాయి. హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత ఈ ఇంటర్వ్యూనే రాచకుటుంబాన్ని ఇరుకునపడేసింది. డయానా మరణం తర్వాత ఆలస్యంగా స్పందించిన రాజకుటుంబంపై విమర్శలు వచ్చాయి.


By March 10, 2021 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/queen-elizabeth-says-racism-claims-of-harry-and-meghan-taken-very-seriously/articleshow/81423132.cms

No comments