Breaking News

వర్షం పడుతోందని చెట్టు కిందికెళ్తే.. షాక్! పిడుగు, సీసీ కెమెరా వీడియో


ర్షం కురుస్తోందని చెట్టు కిందకి పరుగెత్తారు. నలుగురు వ్యక్తులు ఆ చెట్టు చుట్టూ చేరి సేద తీరుతున్నారు. ఇంతలో షాకింగ్. ఆ చెట్టుపై ఓ పడింది. అంతే.. ఆ నలుగురు వ్యక్తులూ కుప్పకూలిపోయారు. హర్యాణాలోని గుర్గావ్‌లో ఓ పార్కులో శుక్రవారం (మార్చి 12) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. గుర్గావ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని స్థానికుడొకరు తెలిపారు. గుర్గావ్‌లోని సెక్టార్ 82 ప్రాంతంలో సిగ్నేచర్ విల్లాస్ అపార్టమెంట్ కాంప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు శివదత్, రామ్ ప్రసాద్, లాలి, అనిల్.. నలుగురూ ఆ కాంప్లెక్స్‌లో గార్డెనర్స్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిడుగు పడగానే బాధితుల్లో ముగ్గురు వెంటనే కుప్పకూలగా.. నాలుగో వ్యక్తి కొన్ని సెకన్లు ఆలస్యంగా నేలకు ఒరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. వర్షం పడినప్పుడు చెట్ల కిందకి వెళ్లొద్దా..? సాధారణంగా వర్షం పడేటప్పుడు రక్షణ కోసం చాలా మంది చెట్ల కిందకి వెళ్తుంటారు. అయితే.. ఇలా చేయడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. చెట్లు, స్తంభాలు ఉన్న చోట్ల పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. Don't Miss: ✧ ✧ ✧ ✧


By March 13, 2021 at 04:10PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shocking-video-lightning-strike-in-gurgaon-caught-on-cctv-camera/articleshow/81483512.cms

No comments