Breaking News

అయోధ్య రామాలయం తవ్వకల్లో బయటపడ్డ పాదుకలు


అయోధ్యలో రామాలయం కోసం నిర్మాణ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో చరణ పాదుకలతో సహా అత్యంత ప్రాచీనమైన కొన్ని విగ్రహాల అవశేషాలు అక్కడ లభ్యమయ్యాయి. వీటిని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సురక్షితంగా భద్రపరచింది. వీటిని పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. అయితేఅయోధ్యలో ఇంతకుమందు కూడా ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పలు ప్రాచీన విగ్రహాలు లభ్యమయ్యాయి. రామాలయ నిర్మాణం అనంతరం ఇక్కడ నిర్మించబోయే మ్యూజియంలో ఇటువంటి ప్రాచీన విగ్రహాలను ఉంచనున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్... జనవరి 15 నుంచి విరాళాలు సేకరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కనీసం రూ.10 విరాళాల రూపంలో పొందేలా కార్యక్రమం అమలు చేసింది. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లో ప్లాన్ రూపొందించారు. ఆయన రూపొందించిన డిజైన్‌ ప్రకారం, రామమందిరం పొడవు 270 అడుగులు. వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉండనున్నాయి.


By March 23, 2021 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/old-idols-found-in-ayodhya-ram-temple-construction-works/articleshow/81642572.cms

No comments