Breaking News

ఇకపై రైళ్లో పొగతాగితే జేబుకు చిళ్లులే కాదు, జైలుకు పోతారు!


మార్చి 13న న్యూఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్5 బోగీకి ప్రమాదవశాత్తు మంటలంటుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి సిగరెట్ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదిక పేర్కొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన .. రైళ్లలో ధుమపానం చేసే వ్యక్తులకు భారీ జరిమానా విధించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని భావిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌5 బోగీ టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పొగతాగిన తర్వాత సిగరెట్‌/ బీడీ వేశారని గుర్తించారు. దీంతో అందులోని టిష్యూ పేపర్లకు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల రైల్వే బోర్డు సభ్యులు, జోనల్ స్థాయి అధికారులతో రైల్వే మంత్రి నిర్వహించిన సమావేశంలోనూ ధూమపానం అంశం చర్చకు వచ్చింది. రైళ్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో పొగరాయుళ్లకు భారీ జరిమానా విధించే విషయం గురించి సమాలోచనలు చేస్తున్నామని ఓ సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు. రైల్వే ఆస్తులకు నష్టం జరగడం, తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తులను అరెస్టు చేసే విషయమై కూడా యోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రైల్వేల చట్టంలోని 167 సెక్షన్ కింద రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు. ఇక విషయం గురించి మరో అధికార మాట్లాడుతూ.. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. అయితే, ఈఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. మంటల వల్ల మరుగుదొడ్డి లోపలి భాగం పూర్తిగా కాలిపోయి పగిలిందని ఆ అధికారి తెలిపారు. మంటలు ప్రారంభమైన తర్వాత కోచ్‌లోని స్మోక్ డిటెక్టర్ ఆగిపోయిందని నలుగురు సభ్యుల దర్యాప్తు బృందానికి ఒక ప్రయాణీకుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించాడని అధికారులు పేర్కొన్నారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి కోచ్‌ను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని, ఇటువంటి ఘటనలను నివారించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్ అన్నారు.


By March 21, 2021 at 03:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shatabdi-fire-probe-railways-mulls-severe-penalty-for-smoking-in-trains/articleshow/81616149.cms

No comments