Breaking News

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి.. లోపల మరో 40 మంది


మహారాష్ట్రలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రత్నగిరి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ప్రమాదంలో కనీసం ఆరుగురు కార్మికులు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎంఐడీసీలోని గార్దా కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోపల 40 నుంచి 50 మంది వరకు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఎగిసిపడటంతో లోపలి చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అర్పుతున్నారు. పేలుడు తర్వాత మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కలా దట్టమైన పొగలు అలముకున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడం వల్ల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. పరిశ్రమంలోని బాయిలర్‌ వద్ద తొలుత పేలుడు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి రావడంతో కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. లోపలి చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకూ ఎంఐడీసీలో ఇటువంటి ఘటనలు ఆరు చోటుచేసుకున్నాయి.


By March 20, 2021 at 01:37PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/atleast-six-killed-in-blasts-and-fire-at-chemical-company-at-ratnagiri-in-maharashtra/articleshow/81602167.cms

No comments