Breaking News

Namrata Shirodkar: మహేష్‌‌ని కిస్ చేస్తూ రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నమ్రత.. పెళ్లి రోజు సూపర్బ్ ట్రీట్


మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ టాలీవుడ్‌లో చూడచక్కని జంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి రోజు నేడు (ఫిబ్రవరి 10). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో భర్త మహేష్ బాబుతో కలిసి ఉన్న రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నమ్రత.. అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాదు ఈ ఫొటోకి అద్భుతమైన కొటేషన్‌ని జతచేసింది నమ్రత. 16 ఏళ్ల పెళ్లి జీవితం చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది నమ్రత. మా వివాహం అనే చిన్న రెసిపీలో ప్రేమ, నమ్మకం, విశ్వాసం అనే దృఢమైన మిశ్రమాలు ఉన్నాయని.. బ్లెస్సింగ్ ఇలానే కలిసికట్టుగా ఎప్పటికీ ఉంటాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎమ్ బీ (మహేష్ బాబు) మోర్ అండ్ మోర్ లవ్ యూ’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను అద్భుతమైన కొటేషన్‌తో తెలియజేసింది . ఇక మహేష్ బాబు కూడా.. తన సతీమణిని ముద్దాడుతూ 16వ పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలియజేశాడు.. ఈ ప్రేమ ఎప్పటికీ.. అంతకు మించే ఉంటుందని ఫొటోను షేర్ చేశాడు.


By February 10, 2021 at 11:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-and-namrata-shirodkar-share-romantic-posts-for-16th-wedding-anniversary/articleshow/80782238.cms

No comments