Breaking News

MeToo: మాజీ మంత్రి ఎంజే అక్బర్ పరువు నష్టం కేసులో ఆమె నిర్దోషి.. కోర్టు తీర్పు


కేంద్ర మాజీ మంత్రి గతంలో దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో జర్నలిస్టు ప్రియా రమణిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఈ తీర్పు ఇచ్చారు. లైంగిక వేధింపులు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. దశాబ్దాల తరువాత కూడా ఫిర్యాదులు చేసే హక్కు మహిళలకు ఉందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఏమిటీ కేసు? 2018లో #MeToo ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. తమపై కూడా గతంలో లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ చాలా మంది మహిళలు ఈ ఉద్యమం కారణంగానే ముందుకు వచ్చి చెప్పారు. ఈ క్రమంలోనే 2018 అక్టోబర్‌లో దాదాపు 20 మంది మహిళా పాత్రికేయులు.. మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌గా పని చేసే సమయంలో లైంగికంగా వేధించినట్లు వారు ఆరోపించారు. వీళ్లందరిలో కెల్ల ఆయన పేరు బయటికి తీసిన తొలి వ్యక్తి . తాను గతంలో రాసిన ఓ కథనాన్ని రమణి 2018 అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని వెల్లడించారు. న్యూస్ రూం బయట, లోపల కూడా ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఈ ఆరోపణల కారణంగానే ఎంజే అక్బర్‌ 2018 అక్టోబర్ 17న తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వ్యక్తిగతంగా పోరాడతానని ఆయన ప్రియా రమణిపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా కోర్టు ప్రియా రమణిని నిర్దోషిగా ప్రకటించింది.


By February 17, 2021 at 05:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-court-acquits-priya-ramani-in-mj-akbar-defamation-case-in-the-part-of-me-too-movement/articleshow/81057692.cms

No comments