Breaking News

Madhavi Latha: షర్మిల కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం.. బీజేపీతో సంబంధాలపై మాధవీలత కీలక వ్యాఖ్యలు


తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై భిన్నవాదనలు వినిపిస్తుండగా.. బీజేపీ మహిళానేత, సినీనటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ ద్వారా వీడియో విడుదల చేసి.. షర్మిల కొత్త పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు మాధవీలత. ఆమె మాట్లాడుతూ.. ‘షర్మిలమ్మ గారు కొత్త పార్టీ ఏర్పాటు.. ఆత్మీయసమ్మేళనం పేరుతో లోటస్ పాండ్‌లో జరిగిన మీటింగ్‌కి సంబంధించిన చాలా ఊహాగానాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిగారి తనయుడు కావడం వల్లనే జగన్ గారు ఏపీలో సీఎం కాగలిగారు. తన చెల్లి షర్మిలకు పార్టీలో అవకాశం ఇచ్చినా.. రాజ్యసభ సీటు ఇచ్చినా.. లేదంటే కుటుంబ పాలనే అనేది జగన్‌గారికి ఇష్టంలేక అయ్యి ఉండొచ్చు.. జగన్-షర్మిల మధ్య విభేదాలు అయ్యిండొచ్చు.. కారణం ఏమై ఉండొచ్చో తెలియదు కానీ.. వైసీపీ అధికారిక ప్రెస్ మీట్‌లో అయితే.. షర్మిలను పార్టీ పెట్టొద్దని జగన్ సూచించినట్టుగా వారు చెప్పారు. తెలంగాణలోనే పార్టీ ఎందుకు పెడుతున్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం వీరికి సహకరించకపోవచ్చు.. కమ్మ సామాజిక వర్గం కూడా సహకరించకపోవచ్చు. తెలంగాణలో పార్టీ పెడితే.. రాజన్న మీద అభిమానంతో షర్మిలకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒక మహిళ కొత్త పార్టీ పెట్టడానికి వచ్చింది దాన్ని స్వాగతిద్దాం.. అందులో తప్పేం లేదు. రాజకీయ పార్టీలు వాళ్ల ఇష్టానుసారంగా పార్టీలు పెట్టుకోవచ్చు. భవిష్యత్‌లో పార్టీ పెట్టి వాళ్లు అనుసరించే తీరు, విధానాలను బట్టి రియాక్షన్ ఉండాలి తప్ప.. ఇప్పుడే స్పందించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఒక మహిళగా నేను షర్మిల కొత్త పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నా. మా మధ్య ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ.. ఈ కొత్త పార్టీకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. బీజేపీ సపోర్ట్‌తో షర్మిల పార్టీ స్థాపించడం లేదు. అయితే షర్మిల కొత్త పార్టీ.. టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగానైనా పనిచేయవచ్చు లేదంటే.. బీజేపీ ఓట్లను చీల్చే విధంగా కూడా ఇది ముందుకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బు ఒక్కటే ఉంటే కాదు.. దానికి ఎన్నో టెక్నికల్ సపోర్ట్ కావాలి. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టుగా తండ్రి పేరు చెప్పుకుని పార్టీ నడపడం అవ్వదు. ప్రజల నమ్మకాన్ని చూరగొనలేరు’ అంటూ షర్మిల కొత్త పార్టీ స్థాపనపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది మాధవీలత.


By February 10, 2021 at 04:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bjp-leader-and-actress-madhavi-latha-reacts-on-ys-sharmila-new-party/articleshow/80786779.cms

No comments