Breaking News

ఫస్ట్‌నైట్ రోజు ఇదేం పని.. వధువు షాక్, ఫొటో వైరల్


తొలిరాత్రి.. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఎంతో మధురమైనది. ఫస్ట్‌ నైట్ కోసం చాలా మంది ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తారు. ఆ మధుర క్షణాలను చిరకాలం గుర్తుండిపోయే విధంగా మలచుకోవడానికి వినూత్న ప్రయోగాలు చేసే వారు కూడా ఉన్నారు. అందుకోసం ఇంటర్నెట్‌ను జల్లెడ పట్టి మరీ కొత్త ఐడియాలను తీసుకుంటారు. కానీ, తొలి రాత్రి రోజు ఓ వరుడు చేసిన పనిమాత్రం నవ్వులు పూయిస్తోంది. సోషల్ మీడియాలో సదరు ఫొటో తెగ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న యువకుడు ఒకరు తొలి రాత్రి రోజు తన పడక గదిలో కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నాడు. అతడి వెనకాలే ఉన్న మంచంపై వధువు అతడి కోసం ఎదురుచూస్తోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇంతకీ ఆ అమ్మాయికి వరుడు ఏం చెప్పి ఉంటాడు?’ అనే ప్రశ్నతో ఈ ఫన్నీ చాట్ మొదలైంది. ‘హోల్డ్ ఆన్ బేబ్’ ( = బేబీ కాస్త ఆగు) అనే మాట జోడించి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘బేబీ కొద్దిసేపు ఆగు.. ముందు నన్ను ట్విటర్ నోటిఫికేషన్లు చెక్ చేసుకోనివ్వు’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘నేను డ్యాన్స్ చేసిన వీడియోలను అప్‌లోడ్ చేసేంతవరకు ఆగు’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ఆ యువతి కూడా భర్త కోసం దీనంగా ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో కొంత మంది రెచ్చిపోయారు! ‘బేబీ నువ్వు కాపేసు ఆగు.. నా సెర్చ్ హిస్టరీ డిలీట్ చేయనివ్వు’ అంటూ మరో నెటిజన్ ఆటపట్టించే కామెంట్ చేశాడు. ‘హోల్డ్ ఆన్ బేబీ.. మరో గంటలో డబుల్ గేమ్ వీక్ డెడ్‌లైన్ ముంచుకొస్తోంది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో గానీ ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..!


By February 10, 2021 at 06:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/photo-of-groom-using-computer-on-first-night-shakes-online-with-funny-comments/articleshow/80788514.cms

No comments