Breaking News

గుడ్ న్యూస్ చెప్పిన బిహార్ ప్రభుత్వం.. ఆ తరగతులకు ఈ ఏడాదీ పరీక్షలు రద్దు!


మహమ్మారి కారణంగా గతేడాది దాదాపు అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ పాఠశాలలను తెరవలేదు. ఆన్‌లైన్ తరగతులనే నిర్వహిస్తున్నాయి. కాగా, బిహార్ విద్యాశాఖ ప్రాథమిక తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలల నిర్వహణకు ఆటంకాలు ఎదురవుతున్నందున బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 2020-21 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులను ప్రమోట్ చేయనున్నారు. బీహార్ విద్యాశాఖ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.‘కోవిడ్-19 కారణంగా విద్యార్థులకు చదువుకు ఆటంకాలు ఏర్పాడ్డాయి.. ఈ కారణంగానే తాము విద్యార్థులకు ఇబ్బంది పెట్టాలను కోవడం లేదు.. 2020-21 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి 8 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేయనున్నాం’ అని తెలిపింది. ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఒకటి నుంచి 8 తరగతి విద్యార్థులకు మూడు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. వీరికి మూడు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అవసరమైన పాఠ్యాంశాలను బోధించనున్నామని పేర్కొన్నారు. దీని వల్ల పై తరగతుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. ఏదైనా కారణాల వల్ల ఆన్‌లైన్ తరగతులను వినకపోయినావారికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు. మార్చి 1 రెండో వారం నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభించనున్నారు. తొమ్మిది, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. గతేడాది ఒకటి నుంచి తొమ్మిది, ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రమోట్ చేశారు.


By February 21, 2021 at 12:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/good-news-for-students-from-1st-to-8th-in-bihar-must-have-passed-without-exams/articleshow/81135053.cms

No comments