Breaking News

విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'A' ట్రైలర్.. ముహూర్తం ఫిక్స్


అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని దర్శకత్వంలో 'A' (AD INFINITUM) మూవీ రూపొందుతోంది. నితిన్ ప్రసన్న హీరోగా పరిచయమవుతున్నాడు. తొలి సినిమానే అయినా ఆయన మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ''మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' సినిమాలతో పక్కింటి అమ్మాయిగా అలరించిన ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. థ్రిల్లర్ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది చిత్రయూనిట్. ఈ మేరకు టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్ లను ప్రముఖ సెలబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ జగపతిబాబు చేతుల మీదుగా విడుదల చేయగా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదేబాటలో ఇప్పుడు 'A' ట్రైలర్‌ని మక్కల్ సెల్వన్ ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ వదిలారు మేకర్స్. కొన్ని సమయాల్లో నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ మూవీ థ్రిల్ చేయనుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని పీవీఆర్‌ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.


By February 02, 2021 at 02:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thriller-movie-a-trailer-released-by-vijay-sethupathi/articleshow/80647523.cms

No comments