Breaking News

ఎనిమిదేళ్లు ఎదురుచూశా.. ఇప్పుడిలా 'నాంది' పడింది.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్


దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ హిట్ అందుకోవడం పట్ల తీవ్ర భావోద్వేగం చెందారు అల్లరి నరేష్. ఎప్పుడూ కామెడీతో కితకితలు పెట్టే అల్లరోడు '' అనే సీరియస్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు యూనిట్ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ చూడని అల్లరోడు ఈ 'నాంది' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు అల్లరి నరేష్. నాంది సినిమాలో తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకొని ఏడ్చేశారు. 2012 ఆగస్టులో ‘సుడిగాడు’ హిట్ తర్వాత తన కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం నాంది అని, ఈ విజయం కోసం ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూశానని నరేష్ అన్నారు. వరుసగా ఎనిమిదేళ్లు పరాజయాల్లో ఉన్నా కూడా తనకు ధైర్యం చెబుతూ ఓ సీరియస్‌ సినిమా చేద్దామని సతీష్‌ వేగేశ్న ప్రోత్సహించారని, తన రెండో ఇన్నింగ్స్‌కి ‘నాంది’తో దర్శకుడు విజయ్‌ కనకమేడల పునాది వేశారని తెలుపుతూ నరేష్ భావోద్వేగం చెందారు. ఉదయం నుంచి చాలా మంది ఫోన్లు చేసి మెచ్చుకుంటూ ఇకపై ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలే చేయమని చెబుతున్నారని నరేష్ తెలిపారు. అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమాగా 'నాంది' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. విడుదల ముందు వచ్చిన అప్‌డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి.


By February 20, 2021 at 11:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allari-naresh-emotional-on-naandhi-success-meet/articleshow/81122642.cms

No comments