Breaking News

టూల్‌కిట్ కేసు: పీజేఎఫ్‌తో జూమ్ మీటింగ్.. ట్విస్ట్ ఇచ్చిన నికితా జాకబ్


కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో బెంగళూరు యువతి దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దిశాతోపాటు పర్యావరణ కార్యకర్తలు , శంతన్‌లకు ఢిల్లీ కోర్టు నాన్-బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థకు చెందిన పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు హాజరైనట్టు ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే ముందు రోజున జరిగిన మీటింగ్‌లో తాను పాల్గొన్నట్టు నికితా జాకబ్ అంగీకరించారు. ఈ మేరకు నికితా తరఫున లాయర్ ముంబయి పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే, ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఈ టూల్‌కిట్‌ను తాము రూపొందించలేదని, ఎక్సిటిక్షన్ రెబెలియన్ వాలంటీర్లు తయారుచేశారని తెలిపారు. అంతేకాదు, గ్రెటా థన్‌బర్గ్‌కు తాను ఎటువంటి సమాచారం షేర్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ టూల్‌కిట్ కేవలం సమాచారానికి సంబంధించిందే, ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపించడానికి కాదని పేర్కొంది. టూల్‌కిట్‌ను పరిశోధించడం, చర్చించడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడం వెనుక ఎటువంటి మతపరమైన, రాజకీయ, ఆర్థిక ఎజెండా లేదని ఆమె పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ, తనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన ఢిల్లీ పోలీసులకు ఏదైనా బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని నికితా జాకబ్ కోరారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం నాలుగు రోజుల కిందట ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం నికితా జాకబ్ ఇంటికి వెళ్లి, ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లు పరిశీలించినట్టు సమాచారం. మరోసారి ప్రశ్నించనున్నట్టు ఢిల్లీ పోలీసులు ఆమెకు చెప్పారు, కానీ, ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఇక, పోలీసుల అదుపులో ఉన్న సైతం తాను కేవలం టూల్‌కిట్‌లో రెండు లైన్లు మాత్రమే ఎడిట్ చేసినట్టు కోర్టులో వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది.


By February 16, 2021 at 01:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/activist-nikita-jacob-accepts-attending-zoom-meeting-with-pjf-in-toolkit-case/articleshow/80975378.cms

No comments