Breaking News

ఫ్రాన్స్‌పై నోరు జారిన పాక్ అధ్యక్షుడు.. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం


ఫ్రాన్స్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐరోపా దేశం తీవ్రంగా స్పందించింది. తమ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పాక్ రాయబారికి ఫ్రాన్స్ విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఇస్లామిగ్ తీవ్రవాద గ్రూపులపై చర్యలకు ఫ్రాన్స్ ఫ్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లుపై పాక్ అధ్యక్షుడు శనివారం మాట్లాడుతూ..ఈ బిల్లు ముస్లింలను కించపరిచినట్లేనని వ్యాఖ్యానించారు. మైనార్టీలను ఒంటరి చేయడం కోసం మెజార్టీ ప్రజలకు అనుకూలంగా చట్టాలను మార్చడం ప్రమాదకరమైన ఉదాహరణ అని ఆరిఫ్ అల్వీ అన్నారు. ‘ఫ్రెంచి రాజకీయ నేతలందరినీ నేను కోరేది ఒకటే.. ఓ మతంపై ఒకరకం ముద్రవేయొద్దు. ఇలా చేస్తే ప్రజల్లో అసమానతలు సృష్టించి, వారి మధ్య విభేదాలు వచ్చేలా చేసినట్లే’ అని వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను తరగతి గదిలో ప్రదర్శించిన ఫ్రాన్స్ టీచర్‌ శ్యామ్యూల్ ప్యాటీని గత అక్టోబరులో ఇస్లామిక్ అతివాదులు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. దీంతో అతివాద గ్రూపులపై చర్యలకు ఫ్రాన్స్ ముసాయిదా బిల్లును ఆ దేశ పార్లమెంట్‌ ముందుంచింది. మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తే, మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించినట్టేనని అల్వీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఫ్రాన్స్ విదేశాంగ శాఖ.. పాక్ ప్రెసిడెంట్ పేర్కొన్నట్టు బిల్లులో ఎలాంటి వివక్షపూరిత విషయాలూ లేవని స్పష్టంచేసింది. ‘ఇది మతం, మనస్సాక్షి స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేస్తుతంది.. వివిధ మతాల మధ్య వివక్ష చూపదు.. కాబట్టి అన్ని విశ్వాసాలకు సమానంగా వర్తిస్తుంది.. దీనిని పాకిస్థాన్ అర్థం చేసుకోవాలి.. మాతో ద్వైపాక్షిక సంబంధాల కోసం నిర్మాణాత్మక వైఖరిని అవలంబించాలి’అని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తెలిపింది. టీచర్ శ్యామ్యూల్ హత్యతో ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను రెస్టారెంట్లు, పలు వేదికలపై ప్రదర్శించగా వీటికి అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్ కూడా మద్దతు తెలపారు. దీనిపై పాకిస్థాన్ సహా పలు ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక, ఇండోనేషియా తర్వాత ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఫ్రాన్స్ కావడం గమనార్హం.


By February 24, 2021 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/france-raps-pakistan-over-president-arif-alvis-remarks-on-french-muslims/articleshow/81182505.cms

No comments