Breaking News

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు.. కేంద్రానికి ఎల్జీ లేఖ


విధించాలని కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బుధవారం సిఫార్సు చేశారు. రెండు రోజుల కిందట కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. అటు, పుదుచ్చేరి అసెంబ్లీని రద్దుచేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ నాయకత్వంలోని విపక్షాలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత ప్రదర్శించాయి. మొత్తం 33 సభ్యులన్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరుగురు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 27కి పడిపోయింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ మెజార్టీ 11కి పడిపోవడంతో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం ఓడిపోయారు. అనంతరం సీఎం తన పదవికి రాజీనామా చేసి, లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌‌కు అందజేశారు. అయితే, విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం కుట్రలు పన్నిందని దుయ్యబట్టారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని అన్నారు.


By February 24, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lieutenant-governor-tamilisai-soundararajan-has-recommended-presidents-rule-in-puducherry/articleshow/81185142.cms

No comments