Breaking News

Tamil Nadu Politics: జైలు నుంచి శశికళ విడుదల.. తమిళ రాజకీయాల్లో కీలక మార్పు?


మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె.. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చారు. కరోనా సోకడంతో ఆమె ప్రస్తుతం విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో విడుదల ప్రక్రియను జైలు అధికారులు హాస్పిటల్లోనే పూర్తి చేశారు. కరోనా లక్షణాలేవీ లేని శశికళను సన్నిహితులు చెన్నైలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడు చెన్నై వెళ్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు శశికళ జైలు నుంచి విడుదలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శశికళ జైలు నుంచి విడుదలైన వేళ.. నూతనంగా నిర్మించిన ‘అమ్మ మెమోరియల్’ను సీఎం పళనిస్వామ ప్రారంభించారు. ఈ మెమోరియల్ వద్ద పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గీయులు బలప్రదర్శన నిర్వహించారు. శశికళకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె బెంగళూరు నుంచి చెన్నై చేరుకునే వేళ.. భారీ వాహనాలతో స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే దినకరన్, ఆయన అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళ జైలు నుంచి బయటకు వచ్చాక అన్నాడీఎంకేలో తిరిగి చేర్చుకోబోమని తమిళనాడు సీఎం పళనిస్వామి ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర్లో ఉన్న వేళ.. ఆమె మౌనంగా ఉంటారా..? లేదంటే కొత్త పార్టీని తెర మీదకు తెస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.


By January 27, 2021 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-vk-sasikala-officially-released-from-prison-after-serving-sentence-for-4-years/articleshow/80475170.cms

No comments