Breaking News

Sudigali Sudheer: నా సినిమా కోసం దేవుడికి దండం పెట్టలేదు.. ప్రదీప్ కోసం పెడుతున్నా: సుడిగాలి సుధీర్


బుల్లితెర నటుడు హీరోగా పరిచయం అవుతుండగా.. బుల్లితెర నటీనటులంతా తరలివచ్చారు. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న డెబ్యూ చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు బుల్లితెర సెలబ్రిటీలు. జనవరి 29న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిత్ర యూనిట్‌తో పాటు జబర్దస్త్, ఢీ సెలబ్రిటీలు హైపర్ ఆది, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, శేఖర్ మాస్టర్, దర్శకుడు అనీల్ రావిపూడి, హీరో కార్తికేయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది.. చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ.. భయం వేస్తుంది. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్లకి.. స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్లందరికీ నా పాదాభివందనాలు. ప్రదీప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్‌లో ప్రదీప్ కాలికి గాయం అయ్యింది. లెగ్ ఇన్‌జ్యురి కారణంగా ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాడు. కానీ పెయిన్‌తోనే ఢీ కానీ ఇతర షోలు కానీ చేస్తూనే ఉన్నాడు. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రదీప్‌కి ఎంటర్ టైన్మెంట్ అంటే ఎంత డెడికేషన్ అన్నది. ఢీ, సరిగమప ఇలా ఏ షో అయినా.. షూటింగ్ అప్పుడు యాంకరింగ్ నిలబడే చేయాలి. నిలబడి ఉండటం వల్ల పెయిన్ వస్తూనే ఉంటుంది.. కానీ ముఖంలో మాత్రం నవ్వుపోదు. కంటిన్యూగా బాధను అనుభవిస్తూనే నవ్వుతూ ఉంటాడు. అంత కష్టపడి ఇంతవరకూ వచ్చాడు ప్రదీప్. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది. రెండేళ్లు ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నా.. నేను నా సినిమాకి కూడా దండం పెట్టుకోలేదు. కానీ ప్రదీప్ సినిమా హిట్ కావాలని దండం పెట్టుకుంటున్నా. ప్రదీప్ హిట్ కొట్టాలంతే. బుల్లితెరపై మమ్మల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారో.. వెండితెరపై ఆదరిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఈ సినిమా చూడండి.. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఈ సినిమా చూసిన తరువాత ఓ పది మందికి మంచిగా చెప్పండి. అది చాలు మాకు. ఈ సినిమా హిట్ కావాలని అందరూ అంటున్నారు. ఈ సినిమా ద్వారా ప్రదీప్‌కి మంచి పేరు రావాలి.. దర్శకుడు మున్నా గారికి మంచి పేరు రావాలి.. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి డబ్బులు రావాలి.. అలాగే డబ్బులు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆది గాడు సినిమా చూసి నాతో చెప్పాడు.. హీరోయిన్ చాలా బాగా చేసిందని.. ఒక సీన్‌లో అమృత ఇరక్కొట్టేసింది.. ప్రదీప్ కనిపించడు అని చెప్పాడు. ఈ సినిమాను అంతలా ప్రేమించడానికి ప్రధాన కారణం ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్.. ఈ పాట మనల్ని థియేటర్ వరకూ తీసుకుని వెళ్తుంది. థియేటర్స్‌కి వెళ్లిన తరువాత మున్నా, ప్రదీప్‌లు రెండున్నర గంటలు ఖచ్చితంగా కుర్చీలో కూర్చోబెడతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారని చెబుతున్నారు. నేను కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. 29న పెద్ద సక్సెస్ చూడబోతున్నాం’ అంటూ చిత్ర విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు సుడిగాలి సుధీర్.


By January 27, 2021 at 12:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sudigali-sudheer-speech-at-30-rojullo-preminchadam-ela-pre-release-event/articleshow/80476101.cms

No comments