RRRకు మించి హైప్.. రికార్డులు తిరగరాస్తోన్న ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్
ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆసక్తి, ఆత్రుత ఏ స్థాయిలో ఉందో టీజర్‌కు వస్తోన్న స్పందన చూస్తుంటే అర్థమవుతోంది. రాకింగ్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ మొదట ప్రకటించింది. అయితే, టీజర్ లీక్ కావడంతో గురువారం (జనవరి 7న) రాత్రే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ రికార్డుల వర్షం కురిపించింది. విడుదలైన 24 గంటల లోపలే గతంలో ఏ సినిమా టీజర్‌కు రానన్ని లైకులు, వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినిమాలోనే అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో అత్యధికంగా లైక్ చేసిన టీజర్‌గా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ నిలిచింది. టీజర్ విడుదలైన 10 గంటల 30 నిమిషాలకు లైకుల సంఖ్య 2 మిలియన్ దాటింది. నిజానికి ఇదో ప్రభంజనం. సౌత్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ టీజర్‌కు కూడా ఈ స్థాయిలో లైకులు రాలేదు. అంతెందుకు, ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘RRR’ టీజర్లకు కూడా ఇన్ని లైకులు రాలేదు. దీన్ని బట్టి ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ హైప్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కలుపుకుని 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో అయితే టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో అయితే 13 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ దాటాయి. 2.5 మిలియన్ లైకులు వచ్చాయి. మొత్తం మీద ఈ పుట్టినరోజును యశ్ మంచి జోష్‌తో జరుపుకుంటున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. రాఖీ భాయ్‌ని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
By January 08, 2021 at 11:09AM
No comments