Breaking News

మనిషి ప్రాణం తీసిన పులి.. రాజస్థాన్‌లోని అభయారణ్యంలో దారుణం


అడవులు క్రమంగా అంతరించిపోతుండటంతో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్న ఘటనలు చూస్తేనే ఉన్నాం. ముఖ్యంగా చిరుతలు, పులులు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని రణతంబోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఓ హల్‌చల్ చేసింది. ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసేసింది. Also Read: పులి దాడిలో మరణించిన వ్యక్తిని రణతంబోర్ టైగర్ రిజర్వు పక్కనున్న కనెడి గ్రామానికి చెందిన పప్పు గుర్జర్(40)గా గుర్తించారు. కనెడి గ్రామశివార్లలో పులి దాడి చేసి ఓ వ్యక్తిని చంపిందని తమకు సమాచారం అందినట్లు టైగర్ రిజర్వు ఫీల్డు డైరెక్టరు టికం చంద్ వర్మ చెప్పారు. మనిషిని చంపిన పులిని అటవీశాఖ అధికారులు ఇంకా గుర్తించలేదు. పులి దాడి చేసిన ప్రాంతాల్లోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించొద్దని హెచ్చరిస్తున్నారు. పులి దాడిలో మరణించిన పప్పు గుర్జర్ కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ఇస్తామని అటవీశాఖ డైరెక్టర్ వర్మ ప్రకటించారు.


By January 08, 2021 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tiger-mauled-a-man-to-death-in-a-village-in-ranthambore-national-park/articleshow/80165146.cms

No comments