Breaking News

మొదటి రోజే బాక్సాఫీస్‌ని దున్నేసిన రామ్.. రికార్డు స్థాయిలో RED కలెక్షన్స్


'ఇస్మార్ట్ శంకర్' లాంటి భారీ హిట్ తర్వాత మరోసారి ట్రెండ్ సృష్టిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా తన లేటెస్ట్ మూవీ REDని రంగంలోకి దింపి కలెక్షన్ల ప్రవాహం పారిస్తున్నాడు. తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి తన ఎనర్జీని చూపించాడు రామ్. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడమే గాక మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఈ థ్రిల్లర్ మూవీపై ఇంట్రెస్ట్ చూపించడంతో ఫస్ట్ డే చెప్పుకోదగిన వసూళ్లు వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ నటన ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంది. రెండు విభిన్న పాత్రల్లో హీరో ఒదిగిపోయిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో RED సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కనిపించింది. దీంతో తొలిరోజే భారీ కలెక్షన్స్ దిశగా అడుగులేస్తూ మొత్తంగా ఈ మూవీ ఫస్ట్ డే 5 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. రామ్ గత సినిమా 'ఇస్మార్ట్ శంకర్' మొదటిరోజు 7.5 కోట్లు వసూలు చేసి.. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు RED మూవీ 5 కోట్లు రాబట్టి రామ్ కెరీర్‌లో రెండో బెస్ట్ మూవీగా నిలిచిందని తెలుస్తుండటం ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. సంక్రాంతి హాలిడేస్ కలసి వచ్చాయి కాబట్టి రెడ్ కలెక్షన్స్‌ ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ RED సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. శ‌్రీ స్ర‌వంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. మణిశర్మ బాణీలు కట్టారు.


By January 15, 2021 at 09:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-pothinenis-red-day-1-collections/articleshow/80278733.cms

No comments