Breaking News

రామ్ గోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు.. కోటి రూపాయల మేర బాకీ!! బిగ్ షాకిచ్చిన సినీ కార్మికులు


ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పని చేసిన ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు ఆయన బాకీ పడ్డారని సమాచారం. దీంతో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అవుతూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ () వర్మపై నిషేధం విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పనిచేరని కన్ఫర్మ్ చేసింది. కరోనా కాలంలోనూ వర్మ వరస సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో తన సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు వర్మ జీతాలు చెల్లించలేదని, అంతా కలిపి కోటి రూపాయల మేర బాకీ ఉన్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ పేర్కొంది. దీనిపై FWICE అధ్యక్షుడు బీఎన్ తివారీ, ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే స్పందిస్తూ.. ఆర్టిస్టులు,టెక్నీషియన్లకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా వర్మకు లీగల్ నోటీసులు పంపించినా కూడా ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని, ఇప్పటికీ బాకీ ఉన్న వేతనాలు చెల్లించలేదని తెలిపారు. వీలైనంత త్వరగా సినీ కార్మికులకు డబ్బులు చెల్లించమని కోరుతూ వర్మకు సెప్టెంబర్‌ 17 నుంచి లేఖలు పంపుతున్నామని వారు చెప్పారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గోవాలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడని తెలిసి అక్కడి ముఖ్యమంత్రికి సైతం లేఖ రాశామని బీఎన్‌ తివారీ అన్నారు. డబ్బులు చెల్లించమని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్తులో వర్మతో పని చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చామన్నారు ఫెడరేషన్ సభ్యులు. గత ఏడాదిగా కరోనా కారణంగా ఎంతోమంది పేద ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారని, అలాంటి వారితో పని చేయించుకుని వాళ్లకు డబ్బులివ్వకుండా తిరగడం వర్మకు సరైంది కాదని వారు అసహనం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో కరోనా, దిశా ఎన్‌కౌంటర్, నగ్నం లాంటి వరుస సినిమాలు చేసిన వర్మ.. ప్రస్తుతం తన లేటెస్ట్ ప్రాజెక్టు 12'O క్లాక్‌ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. చూడాలి మరి FWICE నిర్ణయంపై వర్మ స్పందన ఎలా ఉంటుందనేది!.


By January 12, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fwice-bans-ram-gopal-varma-and-will-not-work-with-him-in-future/articleshow/80225138.cms

No comments