'నాట్యం' ఫస్ట్‌లుక్: ఉపాసన ఎంకరేజ్ చేస్తున్న ఈ మూవీ వెనుక అసలు కథేంటి..?


సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో ఆ సినిమా ప్రమోషన్స్ అంతే బలంగా చేశారంటే ఇక ఆ సినిమాకు తిరుగే ఉండదు. చిత్ర ఆరంభం నుంచే ప్రముఖమైన వ్యక్తులతో ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ లాంటి కార్యక్రమాలు చేయించడం వల్ల ఆ మూవీకి బెస్ట్ ప్రమోషన్ దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన స్నేహితురాలు, హైదరాబాదీ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు తొలి సినిమా '' కోసం నడుం బిగించింది . తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మెగా కోడలు. నిన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి ‘నాట్యం’ అని పేర్కొంటూ సస్పెన్స్ క్రియేట్ చేసిన ఉపాసన.. నేడు (జనవరి 23) ఆ నాట్యం సస్పెన్సుకి తెరదించుతూ 'నాట్యం' ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరితో పంచుకుంది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెడుతూ.. ''తొలిసారి నాట్యం సినిమాతో కెమెరా ముందుస్తున్న నా స్నేహితురాలు సంధ్యా రాజును మీకు పరిచయం చేస్తున్నా. టైటిల్ చాలా నచ్చింది'' అని పేర్కొంది ఉపాసన. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సంప్రదాయ చీరకట్టుతో కనిపిస్తున్న సంధ్యా రాజు.. నటరాజు ఎదుట నాట్య భంగిమతో ఇచ్చిన పోజు ఎంతగానో ఆకట్టుకుంటోంది. డాన్సింగ్ నేపథ్యంలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటన పరంగా, డాన్స్ పరంగా సంధ్యా రాజు తన టాలెంట్ బయటపెట్టనుందట. ఇకపోతే ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హంపి, లేపాక్షి, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి తదితర అందమైన లొకేషన్స్‌లో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


By January 23, 2021 at 12:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-konidela-released-natyam-first-look/articleshow/80419204.cms

No comments