Breaking News

ఒక్కటి కాదు రెండు.. సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్.. గెట్ రెడీ ప్రభాస్ ఫ్యాన్స్


యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. 'సాహో' తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా మరి కొద్దిరోజుల్లో తన బిగ్ మూవీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేనందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్న ప్రభాస్.. దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ భారీ రేంజ్‌లో ఉంటుందని కొన్ని నెలలక్రితమే నాగ్ అశ్విన్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఈ సినిమాపై పడింది. దీంతో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి తర్వాతి అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త సంవత్సరం, సంక్రాంతికి కూడా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ట్విటర్ ద్వారా నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించాడు. ప్రభాస్‌తో మీరు చేయబోయే సినిమా అప్‌డేట్స్ ఏంటి? అడిగాడు. దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. ''కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26న అప్‌డేట్స్ రెడీ చేస్తున్నాం'' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ రెండు అప్‌డేట్స్ ఏమై ఉంటాయనే దానిపై ప్రేక్షకుల్లో కుతూహలం పెరిగింది. సైన్స్ ఫిక్షన్ కథతో భారీ రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌‌గా నటించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు నాగ్ అశ్విన్.


By January 24, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nag-ashwin-says-get-ready-prabhas-fans-for-new-updates/articleshow/80430076.cms

No comments