Breaking News

థియేటర్లు తగ్గినా నైజాంలో దుమ్ములేపుతున్న ‘క్రాక్’.. సినిమా క్లీన్ హిట్


మాస్ మహారాజా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘క్రాక్’ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. రవితేజ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను దాటేసింది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మొదటి హిట్‌ను ‘క్రాక్’ నమోదు చేసింది. నైజాం థియేటర్లు తగ్గించారని ‘క్రాక్’ డిస్ట్రిబ్యూటర్ బాధపడుతున్నా ఆయనకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. నైజాంలో ఇప్పటికే పెట్టిన డబ్బులు వచ్చేశాయి. ఇప్పుడు సూపర్ హిట్ దిశగా ‘క్రాక్’ దూసుకెళ్తోంది. నైజాంలో ఆరు రోజుల్లో ‘క్రాక్’ రూ.6.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో నైజాంలో రూ.10 కోట్ల షేర్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి థియేటర్లు ఎక్కువగా ఉండుంటే ‘క్రాక్’ ఈ పాటికే సుమారు రూ.8 కోట్ల షేర్ వసూలు చేసి ఉండేది. కాగా, ఆరో రోజు నైజాంలో దాదాపు రూ.95 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో షేర్ ఇంచుమించుగా రూ.60 లక్షలు. మొత్తానికి ఆరు రోజుల్లో నైజాంలో ‘క్రాక్’ గ్రాస్ రూ.11.5 కోట్లు కాగా.. షేర్ రూ.6.5 కోట్లుగా ఉంది. మిగిలిన ఏరియాలకు సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ‘క్రాక్’ ఐదు రోజుల్లోనే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను దాటేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయిపోయారట. ఐదు రోజుల్లో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.16.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ.16.5 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. అంటే, ఇప్పటికే సినిమా లాభాల్లోకి వెళ్లిపోయింది. 50 శాతం ఆక్యుపెన్సీతోనే ‘క్రాక్’ ఇంత విజయాన్ని సాధించిందంటే.. 100 శాతం ఉండుంటే మాస్ మహారాజా ఖాతాలో కొన్ని రికార్డులు వచ్చి చేరేవి.


By January 16, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-krack-collects-6-65-crore-share-in-6-days-in-nizam/articleshow/80297068.cms

No comments