Breaking News

పర్యావరణ మార్పులతో దక్షిణ భారతానికి తీవ్ర వరదలు: హెచ్చరించిన అధ్యయనం


భవిష్యత్తులో చోటుచేసుకునే పర్యావరణ మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలో వర్షపాతం తీరుతెన్నులు మారి, వరదలు సంభవిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రస్తు శతాబ్దం చివరికి గ్రీన్‌హౌస్ వాయువు ఇంకా పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (ఇర్విన్‌) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. భూమిపై వివిధ ప్రదేశాల్లోని 27 క్లైమేట్ మోడల్స్‌ను కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా పరిశీలించి, ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ నేచురల్ క్లైమేట్ చేంజ్‌లో ప్రచురించారు. గోళాకారంలో ఉండే భూమిని రెండు భాగాలుగా విభజిస్తే పైన ఉత్తరార్ధ గోళం.. కింద దక్షిణార్ధ గోళం ఉంటాయి. రెండింటినీ విభజిస్తూ భూమధ్యరేఖ ఉంటుంది. అదే నిలువుగా విభజిస్తే ఎడమవైపు పశ్చిమార్ధ గోళం, కుడివైపు తూర్పు అర్ధ గోళం అవుతాయి. భూమధ్యరేఖ వెంబడి ఉండే ట్రాపికల్‌ రెయిన్‌బెల్ట్‌ వల్ల ఆ రేఖకు పైన, కింద వర్షాలు పడే ప్రాంతాలను ట్రాపికల్‌ రెయిన్‌బెల్ట్‌గా వ్యవహరిస్తారు. ఆ బెల్టు తూర్పు అర్ధగోళంలో ఉత్తరం వైపునకు, పశ్చిమ అర్దగోళంలో దక్షిణం వైపునకు మారడం వల్ల దక్షిణ భారతదేశంలో తీవ్రస్థాయిలో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని.. దీనివల్ల ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం, ఆహార భద్రత ప్రమాదంలో పడే ముప్పుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. రెయిన్ బెల్ట్ ఈ ‘స్వీపింగ్ షిఫ్ట్’ మునుపటి అధ్యయనాలలో గుర్తించారని, ఇది వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచ సగటును అందజేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పర్యావరణ మార్పు వల్ల ఆసియా, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతుందని తెలిపింది. ‘ఆసియాలో ఏరోసోల్ ఉద్గారాలను తగ్గించడం, హిమాలయాలలో మంచు కరగడం, పర్యావరణ మార్పుల వల్ల ఉత్తర ప్రాంతాలలో మంచు కవచం కోల్పోవడం వాతావరణం ఇతర ప్రాంతాల కంటే వేగంగా వేడెక్కుతుంది’ అని అధ్యయనం కో-ఆథర్, కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ జేమ్స్ రాండర్సన్ అన్నారు. ‘ఈ వేడి కారణంగా రెయిన్‌బెల్ట్ మారుతుందని మాకు తెలుసు.. తూర్పు అర్ధగోళంలో ఉత్తరం వైపు కదలిక వాతావరణ మార్పు ఊహించిన ప్రభావాలకు అనుగుణంగా ఉంటుంది’ రాండర్సన్ వ్యాఖ్యానించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. అధ్యయనం వ్యవస్థ ఇంజనీరింగ్ విధానం, డేటా అనలిటిక్స్, క్లైమేట్ సైన్స్ తో కలిపి ప్రాంతీయ వర్షపాతం తీవ్రతపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని వెల్లడించింది. అనేక ప్రక్రియలు, ప్రమాణాల మీద ఆధారపడటం వల్ల భూమి వ్యవస్థ సంక్లిష్టత చాలా భయంకరంగా ఉంది అని అధ్యయనంలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త ఎఫి ఫౌఫౌలా-జార్జియో చెప్పారు.


By January 20, 2021 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/climate-change-may-change-rainfall-patterns-in-south-india-intensify-floods-us-study/articleshow/80357464.cms

No comments