Breaking News

మహేష్ బాబు అందంపై మంచు విష్ణు కామెంట్.. కారణం ఇదేనట!


తెలుగు సినిమా హీరోల్లో అందగాడు ఎవరు అంటే అని టక్కున సమాధానం చెబుతారు ఎవరైనా. ఒకప్పుడు యువసామ్రాట్ నాగార్జున హ్యాండ్‌సమ్ హీరోగా తన హవా కొనసాగించగా.. ప్రస్తుతం మహేష్ బాబు అందగాడుగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. మీరు మహేష్ బాబు నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగితే ‘అందం’ అని సమాధానం ఇచ్చారు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు. ఇప్పుడు తాజాగా హీరో మంచు విష్ణు.. మహేష్ బాబు అందంపై కామెంట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి నిన్న రాత్రి జరిగిన మంచు విష్ణు భార్య విరానికా మంచు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులతో తీసుకున్న ఫొటోను మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో మహేష్ బాబు అందాన్ని కొనియాడారు విష్ణు. ‘‘ఈ ఫొటోలోని ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిలా మారిపోతున్నారు. రోజురోజుకి మరింత అందంగా తయారవుతున్నారు. దీనికి ఆయన మంచి తనం, దయా హృదయమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. మంచు విష్ణు ట్వీట్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా, ఈ బర్త్‌డే పార్టీలో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, మంచు విష్ణు, విరానికాతో కలిసి ఆయన కూడా ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ‘సర్కారి వారి పాట’ను మొదలుపెట్టారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ సినిమాను సిద్ధం చేస్తున్నారు. గోపీచంద్ ‘సీటీమార్’ అంటూ వస్తున్నారు.


By January 16, 2021 at 02:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-vishnu-praises-mahesh-babu-good-nature-and-kind-heart/articleshow/80300412.cms

No comments