Breaking News

ధర్మవరంలో పసికందు కిడ్నాప్... తల్లి ఒడిలో నుంచి లాక్కెళ్లిన దుండగులు


జిల్లా ధర్మవరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఐదు మాసాల పాపకు టీకా వేయించేందుకు బుధవారం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. పాపను ఎత్తుకుని తీసుకెళ్తుండగా కొందరు దుండగులు పాపను బలవంతంగా లాక్కెళ్లారు. తల్లి కేకలు వేయడంతో అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్లను వెంబడించారు. దీంతో వారు రైల్వేస్టేషన్ వద్ద పాపను వదిలేసి పరారయ్యారు. పాపను తల్లికి అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్లు ఎవరో తనకు తెలియని పాప తల్లి చెబుతోంది. కుటుంబ కలహాలే కిడ్నాప్‌కు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వాసుపత్రి వద్దే ఈ ఘటన జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. Also Read:


By January 06, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/five-months-baby-girl-kidnaped-in-dharmavaram-anantapur-district/articleshow/80129614.cms

No comments