Breaking News

సముద్రపు ఒడ్డున కూతురితో మోహన్ బాబు రిలాక్స్.. నాకెంతో ప్రత్యేకమంటున్న మంచు లక్ష్మి.. ఫొటో వైరల్


టాలీవుడ్ సెలబ్రిటీ కుటుంబాల్లో ఒకటైన ఫ్యామిలీ.. ప్రస్తుతం వెకేషన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లో నటించడమే గాక సినిమా నిర్మాణ పనులు, ఇతర వ్యాపార కార్యకలాపాలతో బిజీ బిజీగా ఉండే మంచు ఫ్యామిలీ మాల్దీవుల్లో సేద తీరుతోంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో కూతురు , మనవరాలు విద్య నిర్వాణలతో కలిసి మోహన్ బాబు సరదాగా గడుపుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు తమ వెకేషన్ ట్రిప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్న మంచు లక్ష్మి.. తన తండ్రి మోహన్ బాబుకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు పేర్కొంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ''గత రాత్రి బీచ్ ఒడ్డున కుటుంబమంతా కలిసి విందు చేసుకున్నాం. సముద్రపు అందాలను చూస్తూ.. నాన్న నటించిన సినిమాల్లోని పాటలు వింటూ మాకు ఇష్టమైన భోజనం ఆరగించాం. చాలా రోజుల తర్వాత ఇలా మాకోసం మేము ఇలా కొంత సమయాన్ని కేటాయించడం ఆనందంగా ఉంది'' అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో సముద్రపు ఒడ్డున కూతురితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ మోహన్ బాబు అలా నడుస్తూ రిలాక్స్ అవుతున్న పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీతో మోహన్ బాబు ఇలా రిలాక్స్ కావడాన్ని చూసి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. దీంతో మంచు ఫ్యామిలీ మాల్దీవుల వెకేషన్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు సినిమాల విషయానికొస్తే.. చాలా గ్యాప్ తరవాత ఆయన లీడ్ రోల్‌లో 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు రోల్ గతంలో ఎన్నడూ చుడని విధంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


By January 25, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-mohan-babu-relaxed-with-his-family-at-maldives/articleshow/80441887.cms

No comments