Breaking News

నిహారిక పెళ్లయ్యాక మా మధ్య మాటలు తగ్గాయి.. కూతురితో రిలేషన్‌‌పై నాగబాబు ఓపెన్ కామెంట్స్


మెగా డాటర్, కూతురు ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటినుంచి ఏదో ఒకరూపంలో నిహారిక దంపతులు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. పెళ్లి తర్వాత తన కూతురితో రిలేషన్‌‌పై ఓపెన్ అయ్యారు. ఆడ పిల్లలంటే తనకెంతో ఇష్టమని, ఈ సృష్టికి మూలం మహిళలే కాబట్టి ఆడవాళ్లంటే తనకు ఎక్కువ గౌరవమని పేర్కొన్న బాగబాబు.. తన కూతురితో చాలా క్లోజ్‌గా ఉండే వాడినని చెప్పారు. వరుణ్ జ‌న్మించిన అనంత‌రం త‌న‌కు ఒక కూతురు పుడితే బాగుండని అనుకున్నానని, కోరుకున్న‌ట్లే త‌మ‌కు నిహారిక జన్మించిందని అన్నారు. ఆ తర్వాత నిహారిక తనకు ఓ బెస్ట్ ఫ్రెండ్ అయిందని తెలిపారు. తన కూతురితో మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉండేదని, ప్రతి విషయాన్ని ఆమెతోనే పంచుకునే వాడినని తెలిపారు. అయితే నిహారిక పెళ్లి తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు తగ్గడం కాస్త బాధగా అనిపించినా.. త‌న కూతురు కొత్త జీవితంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే నిహారిక చాలా అల్లరి పిల్ల అని, ఎక్కడైనా సరే ఎక్కువగా అల్లరి చేస్తుంటుందని అన్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయిన నిహారిక.. రీసెంట్‌గా మరో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో నిహారికతో పాటు యాంకర్ అనసూయ కూడా భాగం కానుండటం విశేషం.


By January 24, 2021 at 01:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-open-comments-on-relation-with-niharika-after-marriage/articleshow/80432871.cms

No comments