Breaking News

వేస‌వికి వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. సంక్రాంతి పోస్టర్ అదిరింది!


హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాను బన్నీ వాసు, ద‌ర్శకుడు వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మూవీ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలాగే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌థ్యంలో సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘మనసా మ‌న‌సా’ పాటకు, ఆ త‌రువాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ స్పందన ఇచ్చిన ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో అఖిల్, పూజా మ‌ధ్య కెమిస్ట్రీ క‌నువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ ఆల్ట్రా స్టైలిష్‌గా ఉంది. ద‌ర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ త‌న చిత్రాల్లోని పాత్రల్ని చాలా రొమాంటిక్‌గా, అందంగా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి ఉంటుంది. అఖిల్ అక్కినేని, పూజా మ‌ధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఈ చిత్రంలో ఉండ‌బోతుందో ఈ పోస్టర్ డిజైన్‌లో చాలా చ‌క్కగా, అందంగా చూపించారు ద‌ర్శకుడు భాస్కర్‌. ఈ సినిమాను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఆమని, ముర‌ళీ శ‌ర్మ, జ‌య ప్రకాశ్, ప్రగ‌తి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభ‌య్, అమిత్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపీ సుంద‌ర్ సంగీతం సమకూర్చని ఈ చిత్రానికి ప్రదీశ్ ఎమ్ వ‌ర్మ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తండ్ కే వెంక‌టేశ్ ఎడిటర్. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.


By January 13, 2021 at 01:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/most-eligible-bachelor-sankranthi-poster-akhil-movie-headed-to-summer-release/articleshow/80247602.cms

No comments