దొంగలను అరెస్ట్ చేయకుండా వారి బిల్లు కట్టిన పోలీస్.. ఆయన గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా
సూపర్ మార్కెట్‌లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎంతో మంది హృదయ్యాలను కదిలించింది. ఈ కేసు బాధ్యతలు చేపట్టిన పోలీస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీస్‌పై అంతగా అభినందించనడానికి కారణం ఏంటి? ఆయన అంత మంచిపని చేశాడా? అనేది తెలియాలంటే అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో జరిగిన ఈ కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే. మస్సాచుసెట్స్ పరిధిలోని సోమర్‌సెట్‌లో క్రిస్మస్‌కు సరిగ్గా అయిదు రోజుల ముందు మట్‌లిమా అనే పోలీస్ అధికారికి స్థానిక సూపర్ మార్కెట్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ షాపులో దొంగతనం జరిగిందని అవతలి వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును విచారించేందుకు దొంగతనం జరిగిన సూపర్ మార్కెట్‌కు మట్‌లిమా వెళ్లాడు. ఇద్దరు చిన్నారులను తీసుకుని వచ్చిన మహిళలు.. తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని, స్కాన్ చేయించుకోలేదని, డబ్బులు చెల్లించకుండా తమ బ్యాగుల్లో సర్దుకుని వెళ్లిపోయారని సూపర్ మార్కెట్ ఉద్యోగి వివరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీస్ అధికార మట్‌లిమా వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. కానీ, అక్కడ వారి దీనస్థితిని చూసి చలించిపోయాడు. తన కుమార్తెలు వయసులోనే ఆ ఇద్దరు బాలికలు ఉన్నారని గుర్తు చేసుకున్న ఆయన.. పిల్లలకు క్రిస్మస్ డిన్నర్ ఇచ్చే స్థితిలో లేని మహిళలు గత్యంతరం లేక ఈ చోరీ చేశారని నిర్దారణకు వచ్చారు. అహారానికి అవసరమైన కొన్ని వస్తువులను మాత్రమే వారు తీసుకున్నారని, మరే ఇతర విలువైన వస్తువుల జోలికి వెళ్లలేదని గుర్తించాడు. ఉపాధి కోల్పోయిన వీరు పండగ పూట పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడ్డారని అర్ధం చేసుకున్నారు. అంతేకాదు, వారు తీసుకొచ్చిన వస్తువులకు తానే స్వయంగా డబ్బులు చెల్లించాడు. మొత్తం 250 డాలర్లు తన కార్డు ద్వారా చెల్లించి, గొప్ప మనసు చాటుకున్నాడు. పండగ పూట పిల్లలకు మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అలాచేశారని, వారిపై ఎటువంటి నేరారోపణలు చేయరాదని నిర్ణయించుకున్నాడు. దీంతో వారు మరింత ఆనందంగా క్రిస్మస్ జరుపుకునేందుకు సహకరించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులు సైతం పోలీస్ అధికారి మట్‌లిమా చేసిన పనికి మెచ్చుకున్నారు. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకు గర్వకారణమని కొనియాడారు. ‘అధికారి లిమా చర్యలను నేను వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను’అని చీఫ్ మెక్నీల్ అన్నారు. ‘అతని చర్యలు సమాజంలో ప్రజలను రక్షించడం, సేవ చేయడం అంటే ఏమిటో వివరిస్తాయి.. ఒక కుటుంబం తమ పిల్లలకు భోజనం అందించడానికి ప్రయత్నిస్తున్న క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, వారిపై నేరారోపణలు చేయకూడదని ఉదారంగా నిర్ణయం తీసుకున్నాడు.. దీనికి బదులు ఆనందంగా క్రిస్మస్ విందు ఉండేలా చేశాడు’ అని అన్నారు.
By January 05, 2021 at 10:32AM
No comments