కారులో శవమై కనిపించిన జర్నలిస్ట్.. పరారీలో ప్రియురాలు, సీన్ కట్ చేస్తే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన జర్నలిస్ట్ అషూ యాదవ్ హత్య కేసును పోలీసులు చేధించారు. అషూ యాదవ్‌ను అతడి ప్రియురాలే హత్య చేసిందని తేల్చారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా.. సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన అషు యాదవ్ కొంతకాలం క్రితమే జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరారు. అతడు కనిపించడం లేదంటూ జనవరి ఒకటో తేదీన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: ఈ నేపథ్యంలోనే జనవరి 2న సీటీఐ చెరువు సమీపంలో ఓ కారు అనుమానాస్పద స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి చేరుకుని కారును తనిఖీ చేయగా వెనుక సీటులో ఓ మృతదేహం కనిపించింది. అది అషు యాదవ్‌దేనని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో అతడిని ప్రియురాలే చంపేసిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. Also Read: ఆ యువతికి అషు యాదవ్ కంటే ముందే అమిత్ అనే యువకుడితో లవ్ అఫైర్ ఉందని, ఈ విషయం తెలుసుకున్న అషు యాదవ్ ఆమెను వేధించడంతోనే అమిత్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ రాత్రి అషుకు ఫోన్ చేసిన యువతి ఓ చోటికి రప్పించింది. అక్కడ అతడితో మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అమిత్‌తో కలిసి గొంతు నులిమి చంపేసింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉండగా పోలీసులు అమిత్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
By January 05, 2021 at 09:33AM
No comments