న్యూ ఇయర్ వేడుకల్లో అక్కాచెల్లెలిపై రేప్.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగిన నలుగురు బాలురు ఇద్దరు అక్కాచెల్లెళ్లను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. లింగాల మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబరు 31న న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా 14-16 ఏళ్ల వయసున్న నలుగురు బాలురు పీకల దాకా మద్యం తాగారు. అర్ధరాత్రి ఓ గ్రామంలోని ఓ వితంతువు ఇంటికి వెళ్లి బెదిరించి బయటికి గెంటేశారు. ఆమె ఇద్దరు కూతుళ్లను భయపెట్టి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటికీ ఆగకుండా ఆ దారుణాన్ని తమ సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెట్టి పరువు తీస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు పంచాయతీ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని బాధితులను హెచ్చరించి నిందితుల నుంచి పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే అత్యాచార ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని లింగాల ఎస్ఐ కృష్ణయ్యను మీడియాకు తెలిపారు.
By January 04, 2021 at 07:01AM
No comments