రైతు ఆత్మహత్య.. నిరసన స్థలంలోనే దహనం చేయాలని నోట్
ఢిల్లీ శివార్లలో ఓ చేసుకున్నాడు. ఆందోళనలు నిర్వహిస్తున్న స్థలం పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టాయిలెట్‌లో ఆయన ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. రైతులు నిరసనలు చేస్తున్న స్థలంలోనే తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజిపూర్ సరిహద్దు వద్ద శనివారం (జనవరి 2) ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఇది విషాదం నింపింది. ఆత్మహత్య చేసుకున్న రైతును కాశ్మీర్ సింగ్ (75)గా గుర్తించారు. ఆయన యూపీలోని రాంపూర్ నివాసి. స్థానికంగా ఆయణ్ని అందరూ ‘బాపు’ అని పిలుచుకుంటారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికైత్ తెలిపారు. రైతుల పట్ల కేంద్రం చాలా దారుణంగా వ్యవహరించిందని కాశ్మీర్ సింగ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు రాకేశ్ టికైత్ చెప్పారు. రైతు నిరసనలు జరుగుతున్న స్థలంలోనే తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని కాశ్మీర్ సింగ్ కోరారని ఆయన తెలిపారు. గడిచిన నెల రోజులుగా 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే.. పలువురు రైతుల ఆత్మహత్యలకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. డిసెంబర్ నెల మూడో వారంలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఓ పూజారి.. సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనకు మద్దతుగా బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతుల ఆందోళనకు శనివారంతో 38 రోజులు అవుతోంది. Also Read: ★ ★
By January 02, 2021 at 04:34PM
No comments