Breaking News

సాగు చట్టాలను నిలిపివేసే అధికారం మాకుంది: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు


నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందరి కోసం కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. తమకు ఆ అధికారం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు, చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. సమస్య పరిష్కారం కావాలనుకుంటే వారంతా కమిటీని సంప్రదించాలని సూచించింది. కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని, నివేదికను సమర్పించడానికే దీనిని ఏర్పాటుచేసినట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, రైతులతో నేరుగా ప్రధాని మాట్లాడాలని భావిస్తున్నామని పేర్కొంది. చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, వాటిని నిరవధికంగా నిలిపివేయడంలేదని వ్యాఖ్యానించింది. నిర్ణయం తీసుకునే వరకు ప్రభుత్వం వాగ్దానం చేస్తున్నందున కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను రద్దుచేయవద్దని కోర్టు కూడా చెప్పగలదని రైతు సంఘాల తరఫున హాజరయిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు. సోమవారం నాటి విచారణ జ సందర్భంగా కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం చర్యల పట్ల తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా? లేదా మమ్మల్నే ఆ పని చేయమంటారా? అని కేంద్రాన్ని నిలదీసింది.


By January 12, 2021 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-interesting-comments-on-centre-due-to-farm-laws/articleshow/80229274.cms

No comments