Breaking News

అమెరికాలో కరోనా మృత్యుతాండవం.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు!


మెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 4 వేల మార్క్‌ను దాటగా.. మంగళవారం (జనవరి 12) 4470 మరణాలు నమోదయ్యాయి. 2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కే ముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపించాలని నిబంధన విధించాలని నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉంది. యూకేలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇదే తరహాలో ఇతర దేశాల ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులే కాకుండా, యూఎస్ నుంచి విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తిస్తుంది. కరోనా బారినపడ్డ జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో అవి కిక్కిరిసిపోయాయి. చాలా మందికి బెడ్స్, వైద్య సదుపాయాలు అందడంలేదు. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిని అమెరికాకు ఈ దుస్థితి దాపురించడం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను ఆవేదనకు గురిచేస్తోంది. మృతుల అంత్యక్రియలకు శ్మశాన వాటికల్లో చోటు దక్కని దుస్థితి నెలకొంది. Also Read: ✦ ✦


By January 13, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-record-4470-new-covid-19-deaths-235000-fresh-cases-air-passengers-need-covid-negative-test/articleshow/80243533.cms

No comments