కొత్త కరోనా స్ట్రెయిన్‌పై ప్రస్తుత టీకాలు పనిచేయవా? బ్రిటన్ శాస్త్రవేత్తల ఆందోళన
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన స్ట్రెయిన్‌పై ప్రస్తుతం అభివృద్ధి చేసిన టీకాలు పనిచేస్తాయా? అనే సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే శాస్త్రవేత్తలు ఆందోళనకర విషయాలను తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్‌పై ప్రస్తుతం రూపొందించిన టీకాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలకు నమ్మకం లేదని, బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఓ సైంటిఫిక్ సలహాదారు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ సోమవారం రు. కొత్త స్ట్రెయిన్‌పై చాలా ఆందోళన చెందుతున్నామని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హన్‌కాక్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సైతం స్పందించడానికి నిరాకరించింది. ‘ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుల ప్రకారం.. ప్రస్తుత టీకాలు ప్రభావవంతంగా ఉంటాయనే నమ్మకం లేకపోవడమే దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి మాట్ హాంకాక్ ‘నమ్మశక్యం కాని ఆందోళన’కు కారణం’ అని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్త రకం స్ట్రెయిన్‌లు వెలుగుచూడగా.. గత రెండు నెలలుగా ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో వ్యాప్తిచెందుతున్న స్ట్రెయిన్ కంటే దక్షిణాఫ్రికా వేరియంట్ భిన్నమైందని, ఎందుకంటే ఇది మానవ కణాల్లోకి ప్రవేశించిన తర్వాత బహుళ జన్యుమార్పిడిలకు లోనయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది అధిక వైరల్ తీవ్రతతో సంబంధం ఉంది.. అంటే రోగుల శరీరాలలో వైరస్ కణాల అధిక సాంద్రత, అధిక స్థాయి ప్రసారానికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రీజియన్ ప్రొఫెసర్ జాన్ బెల్ మాట్లాడుతూ.. టీకాలు యూకే వేరియంట్‌పై పనిచేస్తాయని తాను భావించానని, అయితే ఇది దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌పై పనిచేస్తుందా అనేది ‘పెద్ద ప్రశ్న’గా ఉందని అన్నారు. దక్షిణాఫ్రికా వేరియంట్‌పై టీకా పనిచేయకపోతే షాట్‌లను స్వీకరించవచ్చని, దానికి ఏడాది సమయం పట్టదని అన్నారు. కొత్త వ్యాక్సిన్‌కు నెల లేదా ఆరు వారాలు పట్టవచ్చు అని ఆయన చెప్పారు.
By January 05, 2021 at 08:38AM
No comments