Breaking News

షిర్డీ యాత్రికుల బస్సులో మంటలు.. అప్రమత్తతో తప్పిన ముప్పు, 21 మంది సురక్షితం


మహారాష్ట్రలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమైన ప్రయాణికులను హెచ్చరించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించుకున్న 21 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ బస్సులో ముంబయికి బయలుదేరారు. ఈ బస్సు థానే సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులందరూ హాహాకారాలు చేసుకుంటూ బస్సులో నుంచి కిందికి దిగిపోయారు. స్థానికుల సమాచారంతో రెండు ఫైరింజన్లు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు వెల్లడించారు. బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.


By January 06, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/21-passengers-escape-for-as-bus-catches-fire-in-thane-returning-to-mumbai-from-shirdi/articleshow/80126315.cms

No comments