Breaking News

ఐస్‌క్రీమ్‌తో కోవిడ్ వ్యాప్తి.. క్వారంటైన్‌లోకి 1,662 మంది ఉద్యోగులు


ఐస్‌క్రీమ్‌, ఇతర చల్లని పదార్థాలు తినడం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందనేందుకు ఏ శాస్త్రీయ ఆధారం లేదని భారత ప్రభుత్వ సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, మహమ్మారి ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే తాజాగా రుజువయ్యింది. ఐస్‌క్రీమ్ కారణంగా వ్యాప్తి చెందిన ఘటన చైనాలో వెలుగు చూసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక దుకాణాల్లో తయారైన మూడు ఐస్‌క్రీమ్ బాక్సుల్ శాంపిళ్లలో కరోనా వైరస్‌ను గుర్తించారు. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారు. వాటిలోని 2,089 బాక్సులను స్టోరేజ్‌లో ఉంచి సీల్ చేశారు. మరో 1,812 బాక్సులను ఇతర ప్రాంతానికి తరలించగా.. మిగతా 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌కు తరలించారు. వీటిలో 65 బాక్సులు ఇప్పటికే అమ్ముడయినట్టు పేర్కొంది. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్ మాట్లాడుతూ.. ఐస్‌క్రీమ్ బాక్సుల్లోకి కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించిందన్నారు. దీంతో ఐస్‌క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తిచెందే అవకాశముందని పేర్కొన్నారు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుందని, దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఐస్‌క్రీం అకస్మాత్తుగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందనే ఆందోళన అవసరం లేదు’ అని అన్నారు. ‘ఉత్పాదక ప్లాంట్‌లో సమస్య, కర్మాగారంలో పరిశుభ్రతకు దారితీసే అవకాశం ఉంది’అని వివరించారు. ఈ ఐస్‌క్రీమ్‌ల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలైన పాల పొడి వంటివి న్యూజిలాండ్ నుంచి, ప్రొటీన్ పౌడర్ ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తాము ఉత్పత్తిచేసిన ఐస్‌క్రీమ్‌ల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు డాకియాడో ధ్రువీకరించింది. ప్లాంట్‌లో పనిచేసే మొత్తం 1,662 ఉద్యోగులను క్యారంటైన్‌లో ఉంచి న్యూక్లియక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వీరిలో 700 మందికి నెగెటివ్ వచ్చిందని, మిగతా 962 మంది ఫలితాల నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది.


By January 16, 2021 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ice-cream-tests-positive-for-coronavirus-in-tianjin-city-in-china/articleshow/80299332.cms

No comments