Breaking News

రెండు గ్రామాలపై ఉగ్రవాదులు ప్రతీకార దాడి.. 100 మంది పౌరులు మృతి


పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 100 మంది పౌరులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై నైజర్‌ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ‌, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు. శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. దీనికి ప్రతీకారంతో రగిలిపోయిన ఉగ్రవాదులు రెండు గ్రామాలపై బాంబులు, ఆయుధాలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి వంద మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో 70 మందికిపైగా గాయపడ్డారు. బోకోహారమ్‌ ఉగ్రవాద సంస్థకు అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో 70 మంది తోచబంగౌ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. మరో 75 మంది గాయపడ్డారని, వారిని రాజధాని నియామేలోని దవాఖానకు తరలించామన్నారు. నైగర్ సంక్లిష్ట భద్రత, మానవతా సవాళ్లను ఎదుర్కొంటుంది. సుమారు 230,000 మంది శరణార్థులు, 250,000 మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారికి ఆతిథ్యం ఇస్తుందని యుఎన్ తెలిపింది. గత కొన్నేళ్లుగా వేళ్లూనుకున్నారు. గత నెలలో ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాఫ్రికా దేశాల్లో బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడటం సర్వసాధారణమయిపోయింది. నైజీరియాలోనూ ఇటీవల 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఏడుగురు భారతీయులను డిసెంబరులో కిడ్నాప్ చేశారు. విదేశీయులు, ప్రముఖులను అపహరించి, డబ్బు డిమాండ్ చేస్తుంటారు.


By January 04, 2021 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/boko-haram-terrorists-killed-100-civilians-in-two-villages-in-niger/articleshow/80090134.cms

No comments