Breaking News

Swaroop RSJ: దేవుళ్ల చేతిలో తుపాకీలు.. ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టార్‌ నౌ


‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు . ప్రస్తుతం ఆయన మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిభావంతులైన నటీనటులు, దర్శకులతో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే తొలి సినిమాతోనే ఆకట్టుకున్న స్వరూప్‌కు అవకాశం ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ముగ్గురు పిల్లలు శివుడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు వేశాల్లో ఓ చేత్తో తమ ఆయుధాలు ధరిస్తూనే మరో చేత్తో తుపాకీ పట్టుకున్నారు. ఇంగ్లీష్ టైటిల్‌లో కూడా sio అక్షరాలు కొట్టేసి.. వాటి స్థానంలో ha అక్షరాలు ఉన్నాయి. తిరుపతి సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన వేట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుందని ఫస్ట్‌లుక్‌ని బట్టి తెలుస్తోంది. ఈ ముగ్గురు పిల్లలతో పాటు మరో రెండు కీలక పాత్రలు కూడా ఉంటాయని యూనిట్ తెలిపింది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రూ: బ్యానర్: మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ రచయిత, దర్శకుడు: స్వరూప్ ఆర్‌ఎస్‌జె నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి అసోసియేట్ నిర్మాత: ఎన్ ఎం పాషా ఛాయాగ్రహణం: దీపక్ యెరగర సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ ఎడిటర్: రవితేజ గిరిజల ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర పీఆర్వో: వంశీ శేఖర్


By December 12, 2020 at 11:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/matinee-entertainment-and-director-swaroop-rsjs-mishan-impossible-launched/articleshow/79691520.cms

No comments